
పయనించే సూర్యుడు న్యూస్ : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామాలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడు కొలువైన రామాలయంలో మంగళవారం ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా సాగింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామాలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడు కొలువైన రామాలయంలో మంగళవారం ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా సాగింది. గర్భగుడిపై కాషాయ రంగులోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగరవేశారు. అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తయిందని చెప్పడానికి ఇది సంకేతం. ప్రధాని మోదీ ఎగరవేసిన జెండా… 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు గల లంబకోణ త్రిభుజాకారంలో ఉంది. ఇది శ్రీరాముని తేజస్సు, శౌర్యాన్ని సూచించే ప్రకాశవంతమైన సూర్యుని చిత్రాన్ని కలిగి ఉంది. ఈ జెండాపై విదర చెట్టు చిత్రంతో పాటు ‘ఓం’ అనే పదం కూడా చెక్కబడి ఉంది. పవిత్రమైన కాషాయ జెండా రామరాజ్య ఆదర్శాలను ప్రతిబింబించే గౌరవం, ఐక్యత, సాంస్కృతిక కొనసాగింపు సందేశాన్ని తెలియజేస్తుందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. అయితే అయోధ్య రామాలయంలో చోటుచేసుకున్న అద్భుత ఘట్టంకు సంబంధించిన ఫొటోలను ఇక్కడ చూడొచ్చు. ప్రధానమంత్రి మోదీ మంగళవారం రోజున అయోధ్య రామాలయంలోని గర్భగుడిపై కాషాయ రంగులోని ధర్మ ధ్వజాన్ని ఎగరవేశారు. ఉదయం 11గంటల 58 నిమిషాలకు ఈ కార్యక్రమం జరిగింది. అంతకుముందు ప్రధాని నరేంద్రమోడీ అయోధ్య రామాలయ కంప్లెక్స్‌లో పలు దేవాలయాలను దర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, తదితర ప్రముఖులు పపాల్గొన్నారు.