జనం న్యూస్: 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు.రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు అంటే 14 నెలల పాటూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, పియూష్ గోయల్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు. భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ సూర్యకాంత్‌తో 53వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్రమోడీతోపాటు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ్ కేంద్రమంత్రులు, గవర్నర్లు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అందరినీ ఆప్యాయంగా పలకరించారు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఇకపోతే 2027 ఫిబ్రవరి 9 వరకు సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ పనిచేయనున్నారు. దాదాపు 14 నెలల పాటు ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. జస్టిస్ సూర్యకాంత్ వ్యక్తిగత జీవితం. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10 హర్యానాలోని హిసార్ పట్టణంలో జన్మించారు.జస్టిస్ కాంత్ 1981లో హిసార్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి. హిసార్‌లోని ప్రభుత్వ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు. 1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ పట్టా పొందారు. 2011లో కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. ఎల్ఎల్ఎంలో ఆయన ఫస్ట్ క్లాస్ ఫస్ట్ సాధించారు. జస్టిస్ కాంత్ 1984లో హిసార్ జిల్లా కోర్టులో తన న్యాయవాద వృత్తిని ప్రారంభించి. మరుసటి ఏడాదికి చండీగఢ్‌కు వెళ్లారు. అక్కడ ఆయన పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో న్యాయవాద వృత్తిని బలంగా కొనసాగించారు. రాజ్యాంగ, పౌర, సేవా చట్టాలలో బలమైన ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నారు. ఆయన విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, బోర్డులకు తరఫున కేసులలో పదునైన వాదనల వినిపించి తక్కువకాలంలో ఖ్యాతిని పొందారు. 2000 జూలైలో కేవలం 38 సంవత్సరాల వయసులో ఆయన హర్యానా అడ్వకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. రాష్ట్ర చరిత్రలో ఆ పదవిని నిర్వహించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచారు. న్యాయమూర్తిగా ప్రయాణం. జస్టిస్ సూర్య కాంత్ 2004 జనవరిలో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత వివిధ హైకోర్టులలో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. 2018 అక్టోబర్‌లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్ సూర్యకాంత్ 2019 మేలో జస్టిస్ గవాయ్‌తో పాటే సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గత ఆరు సంవత్సరాలలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా స్టిస్ సూర్యకాంత్ 300కి పైగా తీర్పులను ఇచ్చారు. వాటిలో ఎక్కువగా సంక్లిష్టమైన రాజ్యాంగ, క్రిమినల్, పరిపాలనా సమస్యలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టులో జస్టిస్ సూర్యకాంత్ పలు చారిత్రాత్మక తీర్పులు ఇచ్చినరాజ్యాంగ ధర్మాసనాలలో భాగంగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు కేసు, సెక్షన్ 6ఏ పౌరసత్వ చట్టం తీర్పు ఇచ్చిన ధర్మాసనాల్లో ఆయన భాగం. సీబీఐ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసం బెయిల్ మంజూరు చేసింది.