పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణపై 26 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్

పయనించే సూర్యుడు న్యూస్ : ఈ వారం ప్రారంభంలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య కూడా ఇలాంటి డిమాండ్లతో ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఒక మెమోరాండం సమర్పించింది. NC JCM తరపున పంపిన మెమోరాండంలో, కార్యదర్శి శివ్ గోపాల్ మిశ్రా టర్మ్స్ ఆఫ్ రిపరెన్స్ ToRలో మార్పులు చేయాలని సాయుధ దళాలతో సహా సేవలందిస్తున్న, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని పేర్కొన్నారు. ఈ మేరకు ToRలో ప్రధాన మార్పులు చేయాలని NC JCM ప్రధాన మంత్రి మోదీని సైతం కోరింది. 8th పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిపరెన్స్ విషయంలో (ToR)లో ప్రధాన మార్పులు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NCJCM) జాతీయ మండలి (స్టాఫ్ సైడ్) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా పంపిన ఈ లేఖలో, పాత పెన్షన్ పథకం (OPS) పునరుద్ధరించడంతో, ఇప్పటికే ఉన్న పదవీ విరమణ చేసిన వారి పెన్షన్లలో మార్పులు, పలు నిబంధనలను చేర్చాలని డిమాండ్ చేశారు. ఎకనామిక్ టైమ్స్‌లోని ఒక వార్తా కథనం ప్రకారం, 8వ CPC ToR ప్రకటించినప్పటి నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలుపుతూ లేఖలు రాస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య కూడా ఇలాంటి డిమాండ్లతో ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఒక మెమోరాండం సమర్పించింది. NC JCM తరపున పంపిన మెమోరాండంలో, కార్యదర్శి శివ్ గోపాల్ మిశ్రా టర్మ్స్ ఆఫ్ రిపరెన్స్ ToRలో మార్పులు చేయాలని సాయుధ దళాలతో సహా సేవలందిస్తున్న, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని పేర్కొన్నారు. ఈ మేరకు ToRలో ప్రధాన మార్పులు చేయాలని NC JCM ప్రధాన మంత్రి మోదీని సైతం కోరింది.

కేంద్ర ఆర్థిక మంత్రి ముందు ఉంచిన డిమాండ్లలో ఇవి ఉన్నాయి: - ప్రస్తుతం NPS కింద ఉన్న 26 లక్షల ఉద్యోగుల కోసం పాత పెన్షన్ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టడం. - వేతన సంఘం అమలు తేదీని జనవరి 1, 2026గా ప్రకటించడం. ఉద్యోగులు పెన్షనర్లకు 20% ఇంటరెమ్ రిలీప్ అందించడం.

స్టేక్‌హోల్డర్స్ నిబంధన తొలగింపుపై అభ్యంతరం : స్టేక్‌హోల్డర్స్ అంచనాలను దృష్టిలో ఉంచుకుని అనే పదబంధాన్ని తొలగించడాన్ని NC JCM అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది 7వ వేతన సంఘం ToRలో ముఖ్యమైన భాగం అని పేర్కొన్నారు. ఈ పదం లేకపోవడం నిరాశపరిచే సంకేతాన్ని పంపుతుందని ఉద్యోగ సంఘం తన లేఖలో తెలిపింది.

పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ మార్పులు : 8th పే కమిషన్ పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్లను కూడా పరిశీలిస్తుందని ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ, ToRలో ఎటువంటి పెన్షన్ మార్పులను ప్రస్తావించలేదని NC JCM నొక్కి చెప్పింది. 11 సంవత్సరాల తర్వాత కమ్యుటేషన్ పునరుద్ధరించాలని, పదవీ విరమణ తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకు 5% అదనపు పెన్షన్, అన్ని పెన్షనర్లకు సవరణ కవరేజ్ పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని సంస్థ డిమాండ్ చేసింది.

పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలి :

జనవరి 1, 2004న లేదా ఆ తర్వాత ప్రభుత్వ సేవలో చేరిన వారికి పాత పెన్షన్ పథకాన్ని స్పష్టంగా పునరుద్ధరించాలని 8వ వేతన సంఘాన్ని కూడా మెమోరాండం కోరింది. ఈ దీర్ఘకాల డిమాండ్ పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత గురించి ఆందోళనలను ప్రతిబింబిస్తుందని NC JCM పేర్కొంది.