జగన్ కేటీఆర్ కలసిన అరుదైన ఫ్రేమ్

* నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన చిత్రాలు.

జనం న్యూస్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బెంగళూరులో ఒకే వేదికపై కలుసుకోవడం తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత మాస్ నాయకులుగా పేరొందిన వారిలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఒకరైతే అటు తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇటు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇరువురి మధ్య సత్సంబంధాలు కొనసాగుతూ ఉండేవి. పలు సందర్భాలలో కేటీఆర్, వైఎస్ జగన్‌లు భేటీలు అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇరువురు ఒకరినొకరు ప్రశంసించుకున్న సందర్భాలు సైతం లేకపోలేదు. అయితే ఇరువురూ గత ఎన్నికల్లో అధికారం కోల్పోయారు. అధికారంలో లేకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గురించి రోజూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఏపీలో ప్రజల పక్షాన వైఎస్ జగన్ ఇటు తెలంగాణలో కేటీఆర్‌లు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ ఒకే వేదిక పంచుకోవడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫోటోలుసైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకే వేదికపై వైఎస్ జగన్, కేటీఆర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికపై కలుసుకున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఈ యువ నేతలు ఇద్దరూ కలిసి పాల్గొనడం చర్చకు దారి తీసింది. అంతేకాదు పక్కపక్కనే కూర్చుని చాలాసేపు ముచ్చటించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదో చెప్తుండగా.. వైఎస్ జగన్ ఆ ముచ్చటను ఆసక్తిగా విటున్నట్లు ఫోటోలు వైరల్ అయ్యాయి.ఇద్దరు నేతలు కలిసి బయటి నుంచి ఫంక్షన్ హాలులోకి వస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *