జనం న్యూస్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. వివరాలు. పుట్టపర్తిలో భగవాన్ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టపర్తి పర్యటనకు విచ్చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఉదయం హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. అక్కడ సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ప్రశాంతి నిలయంలో జరుగుతున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, తదితరులు పాల్గొన్నారు. ఇక, ఈరోజు సాయంత్రం శ్రీసత్యసాయి యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరుకానున్నారు. ఈ స్నాతకోత్సవంలో సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు.