బీజేపీ బెంగాల్ ఇన్‌చార్జ్‌గా తెలుగు నేత మధుకర్ నియామకం

★ బెంగాల్‌పై బీజేపీ ఫోకస్‌ పెరిగింది. ఇన్‌చార్జ్‌గా తెలుగు నేత మధుకర్‌కు కీలక బాధ్యత!

పయనించే సూర్యుడు : వ‌చ్చే ఎన్నిక‌ల్లో బెంగాల్ అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని ఇప్ప‌టి నుంచి క‌మ‌ల ద‌ళం ఉవ్విళ్లూరుతోంది. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తోంది.ఇప్పటికే బీజేపీ ఇన్‌చార్జిలను రంగంలోకి దించేసింది. ఈ ఇన్‌‌చార్జిలలో ఏపీకి చెందిన మధుకర్ చోటు దక్కించుకున్నారు. అత్యంత క్లిష్టమైన ప్రాంతాలలో బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జిగా మధుకర్ నియామకం అవ్వడం ఆసక్తికరంగా మారింది. దేశరాజకీయాల్లో బీజేపీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎన్నికల స్ట్రాటజీని ప్రతీ ఏడాది మారుస్తూ వస్తోంది. అంతేకాదు ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే వెతుక్కుని మరీ విజయం సాధిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఈ పదకొండేళ్లలో బీజేపీ ఓటములను గెలుపుగా...గెలుపులను భారీ విజయాలు మార్చుకుంటూ దూసుకెళ్తుంది అనడానికి అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇటీవలే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ బాహుబలిగా మోడీని మార్చిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థి పార్టీలను ఎన్డీఏ తన ఎత్తులతో చిత్తు చేసింది. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్‌పై బీజేపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గత రెండు పర్యాయాలుగా వెస్ట్‌బెంగాల్‌లో సీఎం పీఠాన్ని అధోహించాలని బీజేపీ తహతహలాడుతోంది. అయితే అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అయితే ఇటీవల జరిగిన బీహర్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పశ్చిమబెంగాల్‌లో తమ జైత్రయాత్ర కొనసాగించాలని యోచిస్తోంది. వెస్ట్ బెంగాల్‌లో సమరానికి సై అంటోన్న బీజేపీ ప‌శ్చిమ‌బెంగాల్‌పై బీజేపీ స్పెష‌ల్‌ ఫోక‌స్ పెట్టింది.తృణ‌మూల్ అధికార పీఠాన్ని దించేలా రాజ‌కీయంగా దెబ్బ‌కొట్టేందుకు బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో భారతదేశం మొత్తం కాషాయమయం చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేయనుంది. దేశ రాజకీయాల్లో ఇక నరేంద్రమోడీ విజయానికి అడ్డుకట్టే వేసే వారు లేరు...ఒక్కోసారి కొన్ని రాష్ట్రాల్లో గెలుపొందకపోయినా కొంత ఆలస్యమైనా ఆ రాష్ట్రం బీజేపీ తన ఖాతాలో వేసుకునేలా పక్కా స్కెచ్‌తో ముందుకు వెళ్తోంది. ఈసారి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పాగా వేయడమే లక్ష్యంతో ఎన్నికల సమరానికి సై అంటోంది.నబద్వీప్ మరియు నార్త్ 24 పరగణాలకు ఇన్‌చార్జిగా ఏపీ బీజేపీ జనరల్ (ఆర్గనైజింగ్)సెక్రటరీ మధుకర్‌తో నియమితులు అయ్యారు. మధుకర్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీనియర్ నేత సురేశ్ రాణాను కూడా ఇన్‌చార్జిగా నియమితులు అయ్యారు. ఈ జోన్ ఇన్‌చార్జిగా మధుకర్ నియమితులు అవ్వడం ఆసక్తికరంగా మారింది. మధుకర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే ఇకపోతే నబద్వీప్ మరియు నార్త్ 24 పరగణాల జోన్ ఇన్‌చార్జిగా నియమితులు అయిన మధుకర్ ఏపీ బీజేపీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పుతున్నారు. అధిష్టానానికి అత్యంత దగ్గరగా ఉండే నాయకుల్లో మధుకర్ ఒకరు. బయట అత్యంత అరుదుగా కనిపించే మధుకర్ తెరవెనుక పార్టీకోసం అహర్నిశలు శ్రమిస్తారని టాక్ ఉంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో బ్యాక్ అండ్ వెరిఫికేషన్‌లో కీలకంగా మధుకర్ పాత్ర ఉంటుంది అని తెలుస్తోంది. బీజేపీ పదాదికారుల సమావేశం....ప్రధాన కార్యదర్శుల సమావేశాలకు హాజరవుతారు. ఇవ్వాల్సిన సూచనలు, సలహాలు ఇస్తారు. జోన్ల వారీగా ఇన్‌చార్జిల వ్యూహాలు మరోవైపు జోన్ల వారీగా కూడా ఇన్‌చార్జిలను బీజేపీ హైకమాండ్ నియమించింది. పశ్చిమబెంగాల్ వ్యాఫ్తంగా ఐదు జోన్లకు ఇన్‌చార్జిలను నియమించింది. ఈ ఇన్‌చార్జిలు పార్టీపై ఫోకస్ పెట్టడంతోపాటు పార్టీ కార్యకలాపాలను. నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్తారు. అంతేకాదు అభ్యర్థుల ఎంపికపైనా ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అంతేకాదు గడప గడపకు బీజేపీ విధానాలను...విధానపరమైన నిర్ణయాలను...ఎన్నికలహామీలను తీసుకెళ్లేందుకు అవసరమైన సైన్యాన్ని కూడా ఈ ఇన్‌చార్జిలు తయారు చేయనున్నారు. కదన రంగంలోకి అమిత్ షా వ‌చ్చే ఎన్నిక‌ల్లో బెంగాల్ అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని ఇప్ప‌టి నుంచి క‌మ‌ల ద‌ళం ఉవ్విళ్లూరుతోంది. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తోంది. ఇటీవ‌ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా కాన్వాయ్ పై దాడి జ‌రిగిన నేప‌థ్యంలో బెంగాల్‌పై బీజేపీ మ‌రింత దృష్టి సారించింది. బెంగాల్‌పై ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టింది.ఏకంగా ఆరుగురు కేంద్రమంత్రులను పశ్చిమబెంగాల్‌లోకి దింపింది కమళదళం.ప‌క్కా ప్లాన్‌తో బెంగాల్ ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని బీజేపీ స్కెచ్ వేస్తోంది.బీజేపీ వ్యూహం ఫలించేనా? ఇకపోతే వెస్ట్ బెంగాల్‌లో కాంగ్రెస్ బలహీనంగా ఉంది. తృణమూల్ కాంగ్రెస్ మూడు దఫాలుగా వరస విజయాలు సాధిస్తుంది.దీంతో మమత బెనర్జీ పాలనపై సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. మరోవైపు రాజకీయ శూన్యత సైతం ఉంది.ఈ అంశాలను తమకు అవకాశంగా మలచుకోవాలని బీజేపీ భావిస్తోంది.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా పశ్చిమ బెంగాల్‌లో పాగా వేయడంపైనే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.ప్రస్తుత రాజకీయాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజల ఆదరణ కూడా తమకే ఉంది అని బీజేపీ భావిస్తోంది.ఈ సారి తృణమూల్ కంచుకోటను కొల్లగొడతామని...బీజేపీ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ భావిస్తోంది.మరి పశ్చిమ బెంగాల్‌పై కాషాయదళం వేస్తున్న వ్యూహాలు ఎం వరకు ఫలిస్తాయో వేచి చూడాలి.