నవంబర్ 25న తెలంగాణ కేబినెట్

* పంచాయితీ రిజర్వేషన్లపై సమగ్ర సమీక్ష * రిజర్వేషన్లపై కీలక చర్చలు!

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ మంత్రివర్గ సమావేశం మంగళవారం (నవంబర్ 25) రోజున జరగనుంది. తెలంగాణ సచివాలయంలోని 6వ అంతస్తులోని కేబినెట్ మీటింగ్ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశం మంగళవారం (నవంబర్ 25) రోజున జరగనుంది. తెలంగాణ సచివాలయంలోని 6వ అంతస్తులోని కేబినెట్ మీటింగ్ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈ కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై చర్చించనున్నారు. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయడంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం నవంబర్ 27న లేదా నెలాఖరు నాటికి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అలాగే డిసెంబర్ 8-9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల వేడుకలు, శాఖల వారీగా పనితీరు సమీక్ష, విద్యుత్ పంపిణీ సంస్థలను బలోపేతం చేయడానికి చర్యలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. గిగ్ వర్కర్స్ బిల్లు, సౌదీ బస్సు ప్రమాదంలో దుర్మరణం చెందిన కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి అథారిటీకి సంబంధించి కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలలో మొత్తం కోటా 50 శాతం పరిమితిని మించరాదని… బీసీ కమిషన్ చైర్మన్ బుసాని వెంకటేశ్వరరావు బీసీ రిజర్వేషన్లపై తాజా నివేదికను సమర్పించారు. ఈ నివేదికను మంత్రుల ఆమోదం కోసం పంపారు. ఇందుకు సంబంధించిన సంతకాలు పూర్తయినట్లు సమాచారంతో ప్రభుత్వం రాబోయే రెండు రోజుల్లో ఒక జీవో జారీ చేస్తుందని భావిస్తున్నారు. పంచాయతీ రాజ్ శాఖ, జిల్లా కలెక్టర్లు జీవో ఆధారంగా రిజర్వేషన్లను నిర్ణయించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు. ఇక, బీసీలకు 42 శాతం కోటాపై కోర్టులో వివాదాలు, ఇతర పరిణామాల నేపథ్యంలో పాత పద్ధతిలోనే పంచాయతీల ఎన్నికలు జరపాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఈ నేపపథ్యంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా సిఫార్స్‌ చేయాలన్న కేబినెట్‌ సూచన మేరకు బూసాని వెంకటేశ్వర రావు సారథ్యంలోని డెడికేటెడ్‌ కమిషన్‌ సిఫారసు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *