ఏపీలో 11 కార్పొరేషన్‌లకు కొత్త నేతలు

* 11 కార్పొరేషన్ చైర్మన్ నియామకాలు ఫైనల్ అధికారిక జాబితా విడుదలకు సిద్ధం

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మరో 11 కార్పొరేషన్లకు చైర్మన్‌లను నియమించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మరో 11 కార్పొరేషన్లకు చైర్మన్‌లను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా కళ్యాణం శివశ్రీనివాసరావును, ఏపీ స్టేట్ అడైయిజరీ ఆన్ చైల్డ్ లేబర్ చైర్మన్ గా వేటుకూరి ఏవిఎస్ సత్యనారాయణ రాజులను నియమించింది. ఈ నియమాకాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 1. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా కళ్యాణం శివ శ్రీనివాసరావు (నరసరావుపేట) 2. ఏపీ స్టేట్ అడైయిజరీ ఆన్ చైల్డ్ లేబర్ చైర్మన్‌గా వేటుకూరి ఏవిఎస్ సత్యనారాయణ రాజు 3.  ఏపీ అఫిషియల్ ల్యాంగ్వేజెస్ కమిషన్ చైర్మన్‌గా విక్రమ్ 4. ఏపీ స్టేట్ పెరిక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ గా వనపర్తి వీరభద్రరావు (పత్తిపాడు) 5.  ఏపీ బట్రాజు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌గా సరికొండ వెంకటేశ్వరరాజు (సత్తెనపల్లి) 6. ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్‌గా ముక్తియార్ (పొద్దుటూరు) 7.  ఏపీ కుర్ని, కరికాల భక్తుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మిన్నప్ప (యమ్మిగనూరు) 8. ఏపీ స్టేట్ రెడ్డిక వెల్పేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్‌గా కొండా శంకర్ రెడ్డి (ఇచ్చాపురం) 9. పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటి చైర్మన్‌గా చిరుమామిళ్ల మదుబాబు (మాచర్ల) 10. ఏపీ ఫిషర్ మెన్ కో ఆపరేటివ్ సొసైటి ఫెడ్ రేషన్ చైర్మన్‌గా యాతగిరి రాంప్రసాద్ (కడప) 11. ఉర్దూ అకాడమీ చైర్మన్ గా మౌలానా షిబిలి (విజయవాడ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *