రాజకీయ వేడి పెరుగుతోంది!

* ఫిరాయింపు కేసులో స్పీకర్‌ను కలిసిన కడియం శ్రీహరి.

జనం న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దూకుడు పెంచారు. ఈ మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నోటీసులు ఇచ్చారు.ఈనెల 23న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి శుక్రవారం ఉదయం అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌‌ను కలిశారు. తన వివరణకు అదనపు సమయం కావాలని లేఖ అందజేశారు.తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వేగవంతం చేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టు తీవ్ర అసహనం చేసిన నేపథ్యంలో ఇక స్పీకర్ రంగంలోకి దిగారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఫిరాయింపు ఎమ్మెల్యేలను విచారించగా ఇద్దరు ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకాలేదు.వారిలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి.మరోకరు ఎమ్మెల్యే దానం నాగేందర్.ఇద్దరూ కూడా కొంత సమయం అడిగారు. అయితే ఇటీవలే కేటీఆర్ మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదంటూ స్పీకర్‌పై ఫిర్యాదు చేశారు. ఇంకెంతకాలం సమయం తీసుకుంటారు అంటూ సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో విచారణలో భాగంగా ఇప్పటి వరకు విచారణకు హాజరుకాని ఎమ్మెల్యే కడియం శ్రీహరికి గురువారం సాయంత్రం స్పీకర్ నోటీసులు జారీ చేశారు. గడువు కోరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దూకుడు పెంచారు. ఈ మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నోటీసులు ఇచ్చారు.ఈనెల 23న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి శుక్రవారం ఉదయం అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌‌ను కలిశారు. తన వివరణకు అదనపు సమయం కావాలని లేఖ అందజేశారు. గడువుకు ముందుగానే స్పీకర్‌ను కలిసిన కడియం శ్రీహరి తనపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన పూర్తి వివరణ సిద్ధం చేయడానికి కొంత మరింత సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి విజ్ఞప్తిపై స్పీకర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు నోటీసులు. ఇదిలా ఉంటే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం సాయంత్రం నోటీసులు ఇచ్చారు. నవంబర్ 23వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే నవంబర్ 23న హాజరవుతారా లేదా అన్న విషయంలో ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై తీసుకోబోయే నిర్ణయాలు…రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలపై కీలక ప్రభావం చూపనున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు అసహనం తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత విచారణ విషయంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‍ తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా? లేకపోతే మమ్మల్ని తీసుకోమంటారా? అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత విచారణ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. వచ్చేవారంలోపు నిర్ణయం తీసుకోవాలని లేదంటే కోర్టు ధిక్కారం కింద నోటీసులు ఇస్తామని తెలిపింది. రాబోయే నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో నిర్ణయించుకోండి అంటూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *