పయనించే సూర్యుడు : హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘‘భారతీయ కళా మహోత్సవం’’ సెకండ్ ఎడిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘‘భారతీయ కళా మహోత్సవం’’ సెకండ్ ఎడిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, పలు రాష్ట్రాల గవర్నర్లు, తెలంగాణ రాష్ట్ర మంత్రి అనసూయ సీతక్క హాజరయ్యారు. ‘భారతీయ కళామహోత్సవ్’ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము సాంస్కృతిక బృందాలతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. రాష్ట్రతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైన భారతీయ కళా మహోత్సవం.లో నవంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ.. ‘‘ఇండియన్ ఆర్ట్స్ ఫెస్టివల్ రెండవ ఎడిషన్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. ఈ ఉత్సవం మొదటి ఎడిషన్‌లో ఈశాన్య భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని మనుకు పరిచయం చేశారు. ఈసారి పశ్చిమ భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చూసే, అర్థం చేసుకునే అవకాశం మనకు లభిస్తుంది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌తో పాటు సిమ్లా, హైదరాబాద్, డెహ్రాడూన్‌లోని రాష్ట్రపతి భవనాలు ప్రజలకు తెరిచి ఉన్నాయి. ఎక్కువ మంది వాటిని సందర్శించి భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, చరిత్రను తెలుసుకోవడానికి ప్రత్యేక ప్రయత్నాలు జరిగాయి’’ అని పేర్కొన్నారు. ఈ మహోత్సవ్‌లో పశ్చిమ రాష్ట్రాలైన మహరాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, గోవాలతో పాటు డామన్ అండ్ డయ్యూ, దాద్రానగర్ హవేలీకి చెందిన గొప్ప సాంస్కృతిక, కళాత్మక సంప్రదాయాలను, వంకాలను ప్రదర్శించనున్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కళాకారులు ఇందులో పాల్గొననున్నారు. సందర్శకులకు ప్రవేశం ఉచితం. అయితే అధికారిక టికెట్ బుకింగ్ పోర్టల్ ద్వారా లేదా ఈవెంట్ పోస్టర్‌లో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము… బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. ఇదిలాఉంటే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాత్రి హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు. శనివారం (నవంబర్ 22) ఉదయం 9:15 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఏపీలోని పుట్టపర్తికి బయలుదేరి వెళ్తారు.