
జనం న్యూస్: శబరిమలకు అయ్యప్పస్వామి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. భారీ సంఖ్యలో అయ్యప్ప భక్తులు తరలి వస్తుండటంతో భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. భక్తులు భరీగా తరలివస్తున్న నేపథ్యంలో ట్రావెన్‌కోర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. స్పాట్ బుకింగ్స్‌ను 20 వేల నుంచి 5 వేలకు తగ్గించింది. అలాగే వర్చువల్ క్యూ పాస్ ద్వారా మరో 70 వేల మందిని అనుమతించాలని నిర్ణయించింది.పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల అయ్యప్పస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు రావడంతో విపరీతమైన రద్దీ నెలకొంది. అయ్యప్ప స్వామివారి దర్శనానికి ప్రస్తుతం 12 గంటల సమయం పడుతోంది.శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. మండల-మకరవిళక్కు తీర్థయాత్ర కోసం శబరిమల ఆలయం తెరిచినప్పటి నుండి ఇప్పటివరకు మూడున్నర లక్షల మందికిపైగా భక్తులు సందర్శించారు. ఊహించని దానికంటే భక్తులు భారీగా తరలిరావడంతో స్పాట్ బుకింగ్‌ల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నెల 24 వరకు వర్చువల్ క్యూ ద్వారా 70 వేల మందికి, స్పాట్ బుకింగ్ ద్వారా 5 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. చెల్లుబాటు అయ్యే వర్చువల్ క్యూ పాస్ కలిగిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తామని తెలిపింది.వర్చువల్ క్యూ పాస్ లేకుండా నీలక్కల్ నుంచి శబరిమలకు ప్రవేశం లేదని ట్రావెన్ కోర్ బోర్డు తెలిపింది.