జనం న్యూస్: మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో రూ.54.88 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు సెప్టెంబర్ 9న రాజ్‌భవన్‌కు ఏసీబీ ఫైలు పంపింది.మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో రూ.54.88 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు సెప్టెంబర్ 9న రాజ్‌భవన్‌కు ఏసీబీ ఫైలు పంపింది. అప్పటి నుంచి ఈ ఫైల్ పెండింగ్‌లో ఉంది. అయితే రాష్ట్రపతి కార్యాలయం నుంచి న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం గవర్నర్ గురువారం ఉదయం కేటీఆర్‌పై విచారణకు అనుమతినిస్తున్నట్లుగా ఫైలుపై సంతకం చేశారు. కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో దాదాపు 55 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ కేసులో మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ప్రాసిక్యూషన్ చేసేందుకు ఏసీబీ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి కోరింది. ఈ మేరకు ఈ ఏడాది సెప్టెంబర్ 9న రాజ్‌భవన్‌కు ఏసీబీ అధికారులు ఫైల్ పంపించారు. దీంతో రాష్ట్రపతి కార్యాలయం నుంచి న్యాయనిపుణుల సలహా తీసుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం ఉదయం కేటీఆర్‌ను ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఫైలుపై సంతకం చేశారు. ఇకపోతే ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాలుగుసార్లు ఏసీబీ విచారణకు అలాగే ఈడీ విచారణకు సైతం హాజరైన సంగతి తెలిసిందే. అసలు వివాదం ఇదే 2023 ఫిబ్రవరి 11న నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హుస్సేన్ సాగర్ చుట్టూ దాదాపు 2.8 కిలోమీటర్ల మేర ఈ కార్ రేసింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో రూ.55 కోట్లు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.హెచ్ఎండీఏ నుంచి రూ.55 కోట్లు విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదలాయించారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ కుంభకోణంకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారించేందుకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో గవర్నర్‌ను ప్రభుత్వం అనుమతి కోరిన సంగతి తెలిసిందే. కేటీఆర్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సై