జగన్‌ సడన్‌ ఎంట్రీ! సీబీఐ కోర్టులో విచారణకు హాజరు

* రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ.

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గురువారం (నవంబర్ 20) రోజున హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గురువారం (నవంబర్ 20) రోజున హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్‌ను సీబీఐ కోర్టు స్వయంగా హాజరు కావాలని ఆదేశించడంతో ఆయన నేడు కోర్టుకు వచ్చారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ ఈరోజు ఉదయం ఏపీలోని తాడేపల్లిలో తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు వెలుపల వైఎస్ జగన్‌కు అభిమానులు, వైసీపీ శ్రేణులు స్వాగతం పలికారు. అనంతరం జగన్ రోడ్డు మార్గంలో నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు చేరుకుని విచారణకు హాజరయ్యారు. అయితే గత ఆరేళ్లలో జగన్ వ్యక్తిగతంగా సీబీఐ కోర్టుకు హాజరుకావడం ఇదే తొలిసారి. గతంలో జగ న్2019లో ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోర్టు విచారణకు హాజరు నుంచి మినహాయింపు పొందిన సంగతి తెలిసిందే. ఇక, తాజగా కోర్టుకు హాజరైన వైఎస్ జగన్ అనంతరం లోటస్‌‌పాండ్‌లోని నివాసానికి బయలుదేరారు. అక్కడ కాసేపపు గడపపనున్న వైఎస్ జగన్… హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరి వెళ్లనున్నారు. విచారణకు హాజరుకావాలన్న సీబీఐ కోర్టు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో వైఎస్ జగన్ క్విడ్ ప్రోకోకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ 11 ఛార్జిషీట్‌లను దాఖలు చేసింది. ఈ క్రమంలో జగన్ జైలుకు కూడా వెళ్లొచ్చారు. అయితే జగన్‌కు బెయిల్ మంజూరు చేసిన సమయంలో కోర్టు పలు కండీషన్లు పెట్టింది. కోర్టు విధించిన షరతుల కారణంగా ఆయన విదేశీ పర్యటలనకు వెళ్లే సమయంలో సీబీఐ కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ క్రమంలోనే ఆయన విదేశీ పర్యటనకు వెళ్లాలని అనుకున్నప్పుడు కోర్టు అనుమతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యూరప్ పర్యటనకు సంబంధించి వైఎస్ జగన్ సీబీఐ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు.అయితే వైఎస్ జగన్ యూరప్ పర్యటనకు అనుమతించిన సీబీఐ కోర్టు… స్వదేశానికి చేరుకున్న తర్వాత తమ ఎదుట హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. జగన్ యూరప్‌ నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈ నెల 14వ తేదీ లోపు కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. అయితే జగన్ మోహన్ రెడ్డి తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ కోర్టులో మెమో దాఖలు చేశారు. తాను కోర్టుకు హాజరైతే ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు అవసరమని, ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని అందులో పేర్కొన్నారు. అయినప్పటికీ కోర్టు తాను హాజరుకావాలని కోరితే… వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని జగన్ అభ్యర్థించారు. అయితే జగన్ మెమోపై నిర్ణయం తీసుకునేందుకు సీబీఐని కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. దీంతో కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ… జగన్ కోరిన మినహాయింపును వ్యతిరేకించింది. విదేశీ పర్యటన సమయంలో జగన్ సరైన కాంటాక్ట్ నంబర్‌‌ను అందించకుండా షరతులను ఉల్లంఘించారని కూడా సీబీఐ ఆరోపించింది. బెయిల్ షరతుల ప్రకారం ప్రతి విచారణకు జగన్‌ హాజరుకావాల్సి ఉందని పేర్కొంది. ఈ క్రమంలోనే వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన మెమోను జగన్‌ తరఫు న్యాయవాది వెనక్కి తీసుకున్నారు. నవంబర్ 14లోపు కాకుండా.. మరికొద్ది రోజులు సమయం జగన్ వ్యక్తిగతంగా కోర్టులో హాజరవుతారని తెలిపారు. దీంతో నవంబర్ 21న లేదా అంతకు ముందు జగన కోర్టు హాజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. దీంతో జగన్ ఒక్క రోజు ముందుగానే కోర్టుకు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *