జనం న్యూస్: మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి చీరల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం లాంఛనంగా ప్రారంభించారుతెలంగాణలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించింది. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి చీరల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్బంగా పలువురు మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున సారె పెట్టి గౌరవించేందుకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేపట్టిందని తెలిపారు. 2034 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు. కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించామని… అయితే ఆర్నేళ్లుగా 65 లక్షల చీరలను సంస్థలు ఉత్పత్తి చేశాయని, వీటిని గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈరోజు నుంచి డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లోకి ఆడబిడ్డలకు చీలర పంపిణీ చేయనున్నట్టుగా చెప్పారు. ఇంకా 35 లక్షల చీరలు రావాల్సి ఉందని తెలిపారు. పట్టణ ప్రాంత ఆడబిడ్డలకు మార్చి 1 నుంచి 8 లోపు అందరికీ పంపిణీ చేస్తామని తెలిపారు. అదే సమయంలో మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ఎంపీలు, మహిళా ఎమ్మెల్సీలు, మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్స్, మహిళా ఐపీఎస్, మహిళా ఐఏఎస్‌లు ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలని కోరారు. వీరంతా ప్రభుత్వం ఇచ్చే సారెకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలని సూచించారు. వీరందరికి ఇందిరమ్మ చీరలను పంపాలని మంత్రి సీతక్క బాధ్యత తీసుకోవాలని కోరారు.ఇందిరమ్మ చీరల పంపిణీకి సంబంధించి నియోజకవర్గానికో ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ‘‘ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లతో పాటు మహిళా సంఘాలకు జీరో వడ్డీ రుణాలు, పెట్రోల్‌బంక్‌లు అప్పగించడం, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యమే కాకుండా బస్సులకు యజమానులను కూడా ఆడబిడ్డలను చేశాం. సోలార్ పవర్ ప్లాంట్లు అందించడానికి ప్రత్యేక కార్యాచరణలో ముందుకు వెళుతున్నాం. స్వర్గీయ ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రిగా దేశంలో అనేక విప్లవాత్మకమైన, స్ఫూర్తిదాయకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం చివరి రక్తపు బొట్టును ధారపోశారు.చీరల విషయంలో ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదు. ఇది మన ఆత్మగౌరవం. ప్రతి ఆడబిడ్డకు చీర అందుతుంది. ఆడబిడ్డలకు సారె పెట్టాలన్న ఆలోచనతో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలి’’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.