పయనించే సూర్యుడు : పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా జన్మ శతాబ్ది ఉత్సవాల్లో మాట్లాడుతూ సమాజానికి ఆయన చేసిన సేవ, బోధనలు తరతరాలను మరింత కరుణామయ ప్రపంచం వైపు నడిపిస్తాయని అన్నారు. పుట్టపర్తి పవిత్ర భూమి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ పుట్టపర్తిలో నిర్వహిస్తున్న శ్రీసత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడుతూ… సమాజానికి ఆయన చేసిన సేవ, బోధనలు తరతరాలను మరింత కరుణామయ ప్రపంచం వైపు నడిపిస్తాయని అన్నారు. ‘‘నేడు పుట్టపర్తిలోని ఈ పవిత్ర భూమిపై మీ అందరి మధ్య ఉండటం నాకు భావోద్వేగ, ఆధ్యాత్మిక అనుభవం. కొద్దిసేపటి క్రితం శ్రీ సత్యసాయి బాబా సమాధి వద్ద నివాళులర్పించే గౌరవం నాకు లభించింది’’ అని మోదీ పేర్కొన్నారు. ‘‘సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలకు మన తరానికి ఒక వేడుక మాత్రమే కాదు… ఇది ఒక దైవిక ఆశీర్వాదం ఆయన మన మధ్య వ్యక్తిగతంగా లేకపోవచ్చు, కానీ ఆయన ప్రేరణ మనందరికీ మార్గనిర్దేశం చేస్తూనే ఉంది. శ్రీ సత్యసాయి బాబా శతాబ్ది సందర్భంగా, రూ. 100 స్మారక నాణెం, ప్రత్యేక పోస్టల్ స్టాంపు జారీ చేయబడటం మన ప్రభుత్వానికి గౌరవం. ఈ సందర్భంగా అందరు భక్తులు, పౌరులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతీయ నాగరికత అనేది సేవ విలువతో కూడుకున్నది. మన సంప్రదాయాలన్నీ చివరికి ఒకే ఆలోచనకు దారితీస్తాయి అవి ‘భక్తి’, ‘జ్ఞాన్’ లేదా ‘కర్మ’ మార్గాన్ని అనుసరిస్తాయి. ప్రతి ఒక్కటి ‘సేవ’తో లోతుగా అనుసంధానించబడి ఉంది.