జనం న్యూస్: తెలంగాణలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్‌లో గ్రామ పంచాయితీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.తెలంగాణలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్‌లో గ్రామ పంచాయితీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో వివిధ రాష్ట్రాలలో కూడా డిసెంబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం… మహారాష్ట్రలోని 246 మున్సిపల్ కౌన్సిల్‌లు, 42 నగర పంచాయతీలకు డిసెంబర్ 2న ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3వ తేదీన చేపట్టనున్నారు. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే మహారాష్ట్రలో మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌లు, పంచాయతీ సమితిలకు దశల వారీగా ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికల ప్రక్రియను 2026 జనవరి మూడో వారం నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ ఓబీసీ కోటాపై దావా కారణంగా ఈ ఎన్నికలు చాలా సంవత్సరాలుగా ఆలస్యం అయ్యాయి. ఇక, కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలను డిసెంబర్ 9, 11 తేదీల్లో రెండు దశల్లో నిర్వహించనున్నారు. డిసెంబర్ 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2026లో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలకు జరుగుతన్న ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.మిజోరంలో స్థానిక ఎన్నికలు కూడా డిసెంబర్‌లో జరగనున్నాయి. లై అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్‌లో డిసెంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. ఇక, అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిసెంబర్ 15న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ పాలన బీజేపీ చేతిలో ఉంది.